English | Telugu

రీ రిలీజ్‌లోనూ ‘బాహుబలి’దే రికార్డు.. ఎంత కలెక్ట్‌ చేసిందంటే?

ఇటీవలికాలంలో స్టార్‌ హీరోల సినిమాలను రీరిలీజ్‌ చెయ్యడం మనం చూస్తున్నాం. కొన్ని సినిమాలు రీరిలీజ్‌లోనూ మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఆ కోవలోనే ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘బాహుబలి1’, ‘బాహుబలి2’ చిత్రాలను కలిపి ఒకే సినిమాగా రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. 2015లో విడుదలైన బాహుబలి1 600 కోట్లు కలెక్ట్‌ చెయ్యగా, 2017లో రిలీజ్‌ అయిన బాహుబలి2 1800 కోట్లు కలెక్ట్‌ చేసి ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది.

బాహుబలి సిరీస్‌ను ఎడిట్‌ చేసి ‘బాహుబలి ది ఎపిక్‌’ పేరుతో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఇండియాలోనే కాదు, ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమాకి మంచి స్పందన లభించింది. కొత్త సినిమాలను కూడా దాటుకొని భారీ కలెక్షన్లు రాబట్టింది. అక్టోబర్‌ 31న విడుదలైన ‘బాహుబలి ది ఎపిక్‌’ చిత్రం ఆడియన్స్‌కి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది.

ఇక కలెక్షన్స్‌ విషయానికి వస్తే.. ‘బాహుబలి ది ఎపిక్‌’కి కూడా రెగ్యులర్‌ సినిమాల్లాగే ప్రమోషన్స్‌ చేశారు. దీంతో సినిమాకి మంచి ఓపెనింగ్స్‌ లభించాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 53 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసింది. రీరిలీజ్‌లో ఇంత మొత్తం కలెక్షన్స్‌ రావడం ఒక రికార్డుగానే చెప్పాలి. ఇప్పటివరకు ఏ సినిమాకీ రీరిలీజ్‌లో ఈ స్థాయి కలెక్షన్స్‌ రాలేదు. ఇక ఏరియా వైజ్‌గా ఈ కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో 23 కోట్లు, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కలిపి 9 కోట్ల 80 లక్షలు, హిందీలో 8 కోట్ల 45 లక్షలు, ఓవర్సీస్‌లో 12 కోట్లు కలెక్ట్‌ చేసింది. మొత్తానికి రీరిలీజ్‌లోనూ తన సత్తా ఏమిటో చూపించింది బాహుబలి.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.