English | Telugu
బాహుబలి ది ఎపిక్ ఓటిటి డేట్ పై రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నాడా!
Updated : Nov 25, 2025
బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్
ఓటిటి డేట్ ఇదేనా!
రాజమౌళి ప్రకటించే అవకాశం
తెలుగు సినిమా కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన బాహుబలి సిరీస్ రెండు భాగాలుగా కలిపి గత నెల అక్టోబర్ 31 న 'బాహుబలి ది ఎపిక్'(Baahubali The epic)గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రీ రిలీజ్ లో కూడా అభిమానులు ప్రేక్షకులు భారీగానే థియేటర్స్ కి పోటెత్తారు దీంతో యాభై కోట్ల రూపాయలకి పైగా కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది. ఇండియన్ సినిమా రీరిలీజ్ చిత్రాల్లో హయ్యెస్ట్ గ్రాసర్ సాధించిన మూవీ కూడా ఎపిక్ నే. అభిమానులతో పాటు ఓటిటి లవర్స్ 'ది ఎపిక్' ఓటిటి రాక కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తు వస్తున్నారు.
ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ మొదటి వారంలో ఓ టిటి వేదికగా స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అఫీషియల్ డేట్ ని దర్శకుడు రాజమౌళి(ss Rajamouli)తో సహా నిర్మాతలు వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. బాహుబలి మొదటి రెండు పార్టుల ఓటిటి హక్కులు జియో హాట్ స్టార్ దగ్గర ఉన్న విషయం తెలిసిందే. సో ఎపిక్ కూడా జియో ద్వారానే స్ట్రీమింగ్ అవుతుంది. కాకపోతే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలకి చెందిన హక్కులు మాత్రమే జియో దగ్గర ఉన్నాయి. హిందీ హక్కులు మాత్రం నెట్ ఫ్లిక్స్ వద్ద ఉన్నాయి. దీంతో ఎపిక్ హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రానుంది.
Also Read: నా భర్త ఒక నార్సిసిస్ట్.. 50 కోట్లు ఇప్పించాలని ప్రముఖ హీరోయిన్ డిమాండ్