English | Telugu

బాహుబలి ది ఎపిక్ మూవీ రివ్యూ 

సినిమా పేరు: బాహుబలి ది ఎపిక్
తారాగణం: ప్రభాస్, అనుష్క, రానా, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్, నాజర్, సుబ్బరాజు తదితరులు
మ్యూజిక్: ఎంఎం కీరవాణి
ఎడిటర్: తమ్మిరాజు
స్క్రీన్ ప్లే -దర్శకత్వం: ఎస్ ఎస్ రాజమౌళి
సినిమాటోగ్రాఫర్: సెంథిల్ కుమార్
బ్యానర్స్ : ఆర్కా మీడియా వర్క్స్
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్
విడుదల తేదీ: అక్టోబర్ 31 ,2025

తెలుగు సినిమా కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన చిత్రాలు బాహుబలి పార్ట్ 1 , పార్ట్ 2 . ఈ రెండిటిని ఒకే భాగంగా కలిపి 'బాహుబలి ది ఎపిక్(Baahubali The epic)గా' మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అక్టోబర్ 31 రిలీజ్ డేట్ కి ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించడం జరిగింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

ఎనాలసిస్

బాహుబలి పార్ట్ 1 కి, పార్ట్ 2 కి చాలా మంది అభిమానులు ఉన్నారు. మేకర్స్ ఎప్పుడు అయితే రెండు భాగాలని కొంత మేర ట్రిమ్ చేసి ఒకే చిత్రంగా తీసుకొస్తున్నామని ప్రకటించారో, ఆ క్షణం నుంచే రెండు పార్ట్ ల లవర్స్ కి ఎక్కడ తమకి నచ్చిన సీన్స్ ఎడిట్ లో తొలగిస్తారో అని బెంగ పట్టుకుంది. ఏ విషయంలో తమ ఇష్ట దైవాలని కూడా ప్రార్ధించి ఉంటారు. అంతలా ప్రతి సీన్, ప్రతి షాట్ ప్రేక్షకుల మనసులో ఫ్రేమ్ గా కట్టబడి ఉన్నాయి. ఏదైతేనేం మేకర్స్ మాత్రం అభిమానులకి మూవీ లవర్స్ కి సరికొత్త ఎక్స్ పీరియెన్స్ ఇవ్వాలని ఎపిక్ తో వచ్చారు. వాళ్ళు అనుకున్నట్టుగానే మంచి అనుభూతినే మిగిల్చారని చెప్పవచ్చు. రెండు భాగాల ప్రధాన ఉదేశ్యం ఎక్కడా డౌన్ కాకుండా కథలోకి పూర్తిగా ఇన్వాల్వ్ చేసింది. కథనంలో ఉన్న వేగం కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఫస్ట్ హాఫ్ లో బాహుబలి పార్ట్ 1 లో చూపించిన కథే ఉంది. కాకపోతే తమన్నా లవ్ ఎపిసోడ్ ని బాగా ట్రిమ్ చేశారు. కట్టప్ప ఇంట్రడక్షన్ సీన్ లో అస్లాం ఖాన్ తో ఉన్న సీన్స్ ని, అమరేంద్ర బాహుబలి చిన్న వయసులో కట్టప్పతో జరిగే ఎపిసోడ్ ని కూడా డిలీట్ చేసారు. యుద్ధ సన్నివేశాలది కూడా అదే పరిస్థితి. ఇలా చేసినా కూడా మన మైండ్ లో నుంచి నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ, భావోద్వేగాలు అలాగే ఉన్నాయి. పైగా కొత్తగా చూస్తున్నామనే ఫీలింగ్ ని కూడా కలిగింది. సెకండ్ హాఫ్ మాత్రం పార్ట్ 2 లోని అన్ని సీన్స్ ని దాదాపుగా ఉంచారు.కాకపోతే అనుష్క, ప్రభాస్ మధ్య వచ్చే కన్నా నిదురించారా సాంగ్ లేదు. క్లైమాక్స్ లో వచ్చే పోరాట సన్నివేశాలని కూడా బాగా ట్రిమ్ చేసారు. ఇవన్నీ చేసినా బాహుబలి ది ఎపిక్ ఇంకా కొత్తగా అభిమానులకి, ప్రేక్షకులకి నచ్చేలా సరికొత్తగా ఉంది. బాహుబలి అభిమానులని మాత్రం ఎక్కడా నిరాశపరచదు.

ఫైనల్ గా చెప్పాలంటే మూడుగంటల నలభై ఐదు నిముషాలు నిడివి ఉన్నా కూడా ఎపిక్ ని కళ్ళు పక్కకి తిప్పుకోకుండా చూస్తాం.