English | Telugu

స్పెషల్ సాంగ్ లో చైతు

నాగచైతన్య హీరోగా ప్రముఖ దర్శకుడు దేవాకట్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆటోనగర్ సూర్య". శనివారం చైతన్య పుట్టినరోజు కానుకగా శుక్రవారం రోజునే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ట్రైలర్ మరియు పోస్టర్స్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ లో చైతన్య చెప్పిన డైలాగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో చైతు సరసన సమంత హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... "సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని ఎదిరించే యువకుడి కథ ఇది. ఇందులో చైతన్యని కొత్తగా చూపించబోతున్నాం" అని అన్నారు. ఈ నెల 27 నుంచి ఓ ప్రత్యేక పాటను తెరకెక్కించనున్నాం. దీంతో చిత్రీకరణ పూర్తవుతుంది అని అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.