English | Telugu
శ్యామ్ గోపాల్ వర్మగా షఫీ
Updated : Nov 22, 2013
నటుడు షఫీ, జోయాఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం "ఏ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్". "నా సినిమా నా ఇష్టం" అనేది ఉపశీర్షిక. ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి. విజయ్ కుమార్ రాజు, రాకేశ్ శ్రీనివాస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాకేశ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. "రక్తపాతం, హింసతో నిండిన సినిమాలు తీసే ఓ దర్శకుడి కథ ఇది. మరి అతని ప్రయాణం ఎలా మొదలైంది? ఎలా ముగిసింది? అనేది వినోదాత్మకంగా చూపిస్తున్నాం" అని అన్నారు. మంత్ర ఆనంద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.