English | Telugu

సల్మాన్ కు జయహో టైటిల్ షాక్

ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ స్వరపరిచిన "జయహో" పాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ పాటకు ఆస్కార్ అవార్డు కూడా రహమాన్ అందుకున్నాడు. అయితే ఈ టైటిల్ పెట్టి ఓ సినిమా నిర్మించాలని రెహమాన్ ప్లాన్ చేసాడు. అయితే ప్రస్తుతం ఇదే టైటిల్ తో సల్మాన్ ఖాన్ హీరోగా "జయహో" అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ విషయం తెలుసుకున్న రెహమాన్ పై ఆగ్రహంగా ఉన్నాడట. దాంతో ఈ టైటిల్ పెట్టే హక్కు ఎవరికీ లేదంటూ సల్మాన్‌కి లాయర్ నోటీసు పంపించినట్టు బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. నిజానికి ఈ చిత్రానికి ముందు "మెంటల్" అనే టైటిల్‌ని పెట్టారు. కానీ ఇది సామాజిక స్పృహ ఉన్న నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి "జయహో" అనే టైటిల్ అయితే బాగుంటుందని ఈ టైటిల్‌ని ఖరారు చేశారు. మరి సల్మాన్ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో త్వరలోనే తెలియనున్నది.