English | Telugu
సునీల్ పాటల వేడుకలో ఒకరి మృతి
Updated : Dec 22, 2013
సునీల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'భీమవరం బుల్లోడు". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం భీమవరంలో జరిగింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సురేష్ బాబు నిర్మించిన ఏ చిత్రానికి ఉదయ్ శంకర్ దర్శకత్వం వహించాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సునీల్ సరసన ఎస్తర్ హీరోయిన్ గా నటించింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. "సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ 50వ వార్షికోత్సవ వేడుకను భీమవరంలో జరపడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం మంచి ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి, ఆడియో విడుదల చేసారు. ఈ వేడుకలో హీరోహీరోయిన్లు రెండు స్టెప్పులు కూడా వేసి, అభిమానులను అలరించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ వేడుకలో ఒక అపశ్రుతి చోటుచేసుకుంది. సంగినీడి సురేష్ (25) అనే వ్యక్తి ఈ వేడుకను చూడటానికి వచ్చి, ఆ తొక్కిసలాటలో మృతి చెందాడు. ఫిట్స్ వచ్చి చనిపోయాడని భావిస్తున్నాం. కానీ మాకు ఇంతవరకు ఏ ఫిర్యాదు అందలేదన్నారు పోలీసులు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.