English | Telugu
నందమూరి సింహానికి స్వల్ప గాయం
Updated : Nov 6, 2013
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్ర షూటింగ్లో ఆయన గాయపడ్డారు. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ సింహాచలంలో జరుగుతుంది. ఆ షూటింగ్లో భాగంగా బాలకృష్ణ మోచేతికి స్వల్పంగా గాయమవడంతో, వెంటనే బాలకృష్ణను విశాఖలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్ లో చేర్పించి, చికిత్సను అందించారు. చికిత్స అనంతరం ఆయన మళ్లీ యధావిధిగా షూటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ సరసన రాధిక ఆప్టే, సోనాల్ చౌహన్లు కథానాయికలుగా నటిస్తున్నారు. జగపతి బాబు ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.