English | Telugu
అంజలికి పునీత్ వరాలు
Updated : May 7, 2014
తెలుగులో పెద్ద పెద్ద సినిమాలలో నటించే అవకాశం త్వరగా తగ్గించుకున్న అంజలికి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు తగ్గాయి. దాంతో తమిళ ఇండస్ట్రీపైనే ఆధారపడిన ఈ అమ్మడికి కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఓ పెద్ద ఆఫర్ ఇచ్చాడు.
తాజాగా కన్నడంలో పునీత్ రాజ్‌కుమార్ హీరోగా ‘రణ విక్రమ’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మొదటి హీరోయిన్ గా రచితరాం ను ఎంపిక చేసుకున్నారు. అయితే మరో హీరోయిన్ గా అంజలిని ఎంపిక చేసుకున్నారు. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో పునీత్ కనిపించబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఒకవేళ ఈ సినిమా మంచి విజయం సాధించి తనకు మరిన్ని అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.