English | Telugu
సినీ నటుడు జీవి పరిస్థితి విషమం
Updated : May 7, 2014
ప్రముఖ సినీ నటుడు సుధాకర్ నాయుడు (జీవి) విశాఖపట్నం గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్స్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఎన్నికల ప్రచారాన్నిముగించుకొని, కూర్మన్న పాలెం శివాజీ నగర్ లో గల తన కార్యాలయానికి రాత్రి 9గంటలకు తన సన్నిహితులతో బయలుదేరారు. శనివాడ గ్రామానికి దగ్గరలో ఉన్న రేడియో రిసీవింగ్ స్టేషన్ సమీపంలోకి రాగానే నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు వేసుకుని వారి కారును అడ్డగించి, ఇనుపరాడ్లతో దాడి చేశారు. కానీ వారిని తప్పించుకొని వెళ్ళిన కూడా మరో నలుగురు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వచ్చి దాడికి ప్రయత్నించారు. కానీ వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పడంతో రోడ్డు డివైడర్ పైకి కారు దూసుకెళ్లింది. దాంతో వారు అక్కడి నుంచి పరారి అయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సుధాకర్ నాయుడుని ఆసుపత్రికి తరలించారు. అయితే పెద్గగా గాయాలేమీ కాలేదని డాక్టర్లు చెబుతున్నప్పటికీ... ఆయన పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సుధాకర్ నాయుడు ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలోనే తెలియనున్నాయి.