English | Telugu

అవతార్ 3 థియేటర్స్ కి వార్నింగ్.. లెటర్ తో సహా దొరికిపోయిన అగ్ర దర్శకుడు  

-వార్నింగ్ ఇస్తున్న దర్శకుడు ఎవరు
-ఈ నెల 19 న ఏం జరగబోతుంది
-లెటర్ లో ఏముంది
-జేమ్స్ కామెరూన్ ఏమంటున్నాడు!


వరల్డ్ సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచ సినీ పితామహుడు జేమ్స్ కామెరూన్(James Cameron)మరో అద్భుత సృష్టి 'అవతార్ 3 ఫైర్ అండ్ యాష్'(Avatar 3: Fire and ash)ఈ సారి పాండోరా ప్రపంచానికి కొత్త శత్రువుగా వరాంగ్ ని కామెరూన్ పరిచయం చేయబోతున్నాడు. దీంతో ఈ నెల 19 న ప్రపంచవ్యాప్తంగా మొదటి రెండు పార్టులకి మించి సెల్యులాయిడ్ పై సరికొత్త వండర్ ప్రత్యక్షం కాబోతుంది. ఈ నేపధ్యంలో పార్ట్ 3 ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చూడాలనుకునే వాళ్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతు ఉంది. ఇప్పుడు వాళ్ల తొందరని జేమ్స్ కామెరూన్ రాసిన ఒక లేఖ రెట్టింపు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


రీసెంట్ గా కామెరూన్ థియేటర్ టెక్నీషియన్లకు, యజమానులకు ఒక ప్రత్యేకమైన లేఖ రాసారు. సదరు లేఖలో ఈ సినిమాతో పాటు పంపిన డీసీపీ లో ప్రొజెక్షన్ స్పెసిఫికేషన్ ఫైల్, ఫ్రేమింగ్ చార్ట్ ఉన్నాయి. వాటిని తప్పకుండా పాటించాలి. లైట్ లెవల్స్, ఆడియో కాన్ఫిగరేషన్ కూడా ముఖ్యం.సౌండ్ సిస్టమ్ ని నేనే వ్యక్తిగతంగా మిక్స్ చేశాను. పూర్తి అనుభూతి కోసం 7.0 రిఫరెన్స్ సౌండ్ లెవల్‌ని తగ్గించవద్దు. థియేటర్ల నిర్వహణ ప్రేక్షకుల అనుభూతిలో కీలకం.ఆ విషయంలో ఎలాంటి రాజీపడవద్దు. ఒక రకంగా హెచ్చరిక లాంటిదని తన లెటర్ లో కామెరూన్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

also read: తిండి, నిద్ర మానేసి రాత్రంత అదే పని.. దాంతో ఆరోగ్యం నాశనం

దీంతో కామెరూన్ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'ప్రపంచ సినీ ప్రేక్షకులకి అత్యుత్తమ క్వాలిటీ తో సినిమాని అందించాలనే నిబద్దత కామెరూన్ కి ఎంతలా ఉంటుందో అనడానికి ఇదొక నిదర్శనమని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అవతార్ 3 సుమారు 400 మిలియన్ల డాలర్స్ తో తెరకెక్కింది.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.