English | Telugu

పవన్ లేకుండానే వెంకీ మొదలు

హిందీలొ సూపర్ హిట్టయిన "ఓ మై గాడ్" చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే చాలా ఆలస్యం అయినందువలన త్వరగా వెంటనే షూటింగ్ ను ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఇందులో పవన్, వెంకటేష్ ముఖ్య పాత్రలలో నటించనున్నారు. అయితే పవన్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడం వలన ఈ సినిమాలోని వెంకటేష్ సన్నివేశాలను ముందుగ తెరకెక్కించాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఓ భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. జూన్ నెల నుంచి పవన్ ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.