English | Telugu

'ఆంధ్ర కింగ్ తాలూకా'.. ఆ నెగెటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందా..?

సినిమా వాళ్ళు సెంటిమెంట్ లు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. రేపు(నవంబర్ 27) విడుదలవుతోన్న 'ఆంధ్ర కింగ్ తాలూకా'ను కూడా ఒక నెగెటివ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. మరి ఈ సినిమా ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందా లేదా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. (Andhra King Taluka)

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర ప్రధాన పాత్రలు పోషించిన మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా'. ఇది ఒక అభిమాని కథగా పి.మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కింది. ఇందులో హీరో పాత్రలో ఉపేంద్ర కనిపిస్తుండగా, అభిమాని పాత్రలో రామ్ కనిపిస్తున్నాడు. ఎమోషనల్ రైడ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ.. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ఆకట్టుకుంది. సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గానే ఉంది. అయితే ఒక నెగెటివ్ సెంటిమెంట్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది.

Also Read: 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఫస్ట్ రివ్యూ!

తెలుగులో హీరో-అభిమాని కథతో సినిమాలు రావడమే అరుదు. వచ్చినా విజయం సాధించిన సందర్భాలు లేవనే చెప్పాలి. 2005లో 'శీనుగాడు చిరంజీవి ఫ్యాన్', 2006లో 'ఒక వి చిత్రం' వంటి సినిమాలు వచ్చాయి. కానీ, అవి కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయాయి. ఇప్పుడు ఆ నెగెటివ్ సెంటిమెంట్ ని 'ఆంధ్ర కింగ్ తాలూకా' బ్రేక్ చేస్తుందేమో చూడాలి.