English | Telugu
వివాదంలో యాంకర్ శివజ్యోతి.. తిరుపతిలో ఇవేం మాటలు!
Updated : Nov 22, 2025
ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో తెలుసుకోకపోతే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు ఎక్కడ ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో తెలుసుకోవాలి. లేదంటే తీవ్ర విమర్శలు ఎదుర్కోక తప్పదు. తాజాగా యాంకర్ శివజ్యోతికి అలాంటి పరిస్థితి ఎదురైంది.
కుటుంబ సభ్యులతో తిరుపతి వెళ్ళిన శివజ్యోతి.. క్యూ లైన్ లో ప్రసాదం తీసుకుంటుండగా తీసిన సెల్ఫీ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో "తిరుపతిలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం", "తిరుపతిలో రిచెస్ట్ బిచ్చగాళ్లం" అంటూ శివజ్యోతి కామెంట్స్ చేసినట్టుగా ఉంది.
Also Read: 'రాజు వెడ్స్ రాంబాయి'కి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్!
శివజ్యోతి చేసిన కామెంట్స్ పై శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన ప్రసాదాన్ని అడుక్కోవడం అనడం ఏంటి? వెకిలి నవ్వులతో రిచెస్ట్ బిచ్చగాళ్లం అనడం ఏంటి? అంటూ ఫైర్ అవుతున్నారు.
వివాదం మరింత ముదరకముందే.. శివజ్యోతి ఆ వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతుందేమో చూడాలి.