English | Telugu

శివ మూవీపై అల్లు అర్జున్ వీడియో.. రెండు లారీలతో థాంక్స్ చెప్పిన నాగార్జున  

తెలుగు సినిమా స్థితిని, గతిని మార్చేసిన చిత్రాల్లో కింగ్ నాగార్జున 'శివ'(Shiva)కూడా ఒకటి. 1989 అక్టోబర్ 5 న రిలీజైన శివ నాగార్జున(Nagarjuna)కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా టెక్నీకల్ గాను నూతన ఒరవడిని సృష్టించింది. భారతీయ సినీ పరిశ్రమ మొత్తాన్ని కూడా తెలుగు సినిమా వైపు చూసేలా చేసింది. ఇప్పుడు ఈ మూవీ నవంబర్ 14 న రీ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ 'అల్లుఅర్జున్'(Allu Arjun)శివ గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అల్లు అర్జున్ మాట్లాడుతు శివ రిలీజ్ అయ్యి దాదాపుగా 36 ఏళ్ళవుతుంది. ఎప్పటికి తెలుగు సినిమాకే కాదు ఇండియన్ సినిమాకి శివ ఒక ఐకాన్ మూవీ. శివ తర్వాతే తెలుగు సినిమాతో పాటు ఇండియన్ సినిమాల్ని తెరకెక్కించే విధానంలో మార్పులు వచ్చాయి. అలాంటి శివ మళ్ళీ హయ్యస్ట్ క్వాలిటీతో, టెక్నాలజీ తో రీ రిలీజ్ కాబోతుంది. దీంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో పండుగ వాతావరణం రానుంది. నాగార్జున గారి ఫ్యాన్స్ ఈ సారి థియేటర్స్ కి రెండు లారీల పేపర్స్ తీసుకెళ్లండని సదరు వీడియోలో చెప్పాడు.

సదరు వీడియోని నాగార్జున తన 'ఎక్స్'(X)అకౌంట్ వేదికగా షేర్ చెయ్యడంతో పాటుగా డియర్ అల్లు అర్జున్, రెండు లారీల థాంక్స్ అనే క్యాప్షన్ ఉంచాడు. అన్నపూర్ణ సంస్థ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శివ ని రీ రిలీజ్ చేస్తున్నారు. రామ్ గోపాల్(Ram Gopal Varma)దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించగా నాగార్జునతో అమల(Amala)జత కట్టింది. భవాని క్యారక్టర్ లో రఘువరన్(Raghuvaran)ఒక కొత్త రకం విలనిజాన్ని భారతీయ చిత్ర పరిశ్రమకి పరిచయం చేసాడు. సాయిచంద్, శుభలేఖ సుధాకర్, చిన్నా, రామ్ జగన్ తదితరులు కీలక పాత్రలు పోషించగా ఇళయరాజా(Ilaiyaraaja)అందించిన సాంగ్స్ కూడా ట్రెండ్ సెట్ గా నిలిచాయి.