English | Telugu

'ల‌వ్ స్టోరి' త‌ర్వాత అంద‌రి క‌ళ్లూ 'బ్యాచ్‌ల‌ర్' పైనే!

నాగ‌చైత‌న్య లేటెస్ట్ ఫిల్మ్ 'ల‌వ్ స్టోరి' హిట్ కావ‌డంతోనూ, ఆ మూవీలో రేవంత్ క్యారెక్ట‌ర్‌లో అత‌నిచ్చిన ప‌ర్ఫార్మెన్స్ అంద‌రి ప్ర‌శంస‌లూ పొందుతుండ‌టంతోనూ అక్కినేని ఫ్యాన్స్ అమితానందంతో ఉన్నారు. ఆ సినిమా చైతూ కెరీర్‌కు ఊపు తేవ‌డ‌మే కాకుండా సినిమా ఎగ్జిబిష‌న్ వ్య‌వ‌స్థ‌కు కూడా ఊపిరినిచ్చింది. దీంతో అంద‌రి క‌ళ్లూ చైత‌న్య తమ్ముడు అఖిల్ మూవీ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' మీద‌కు మ‌ళ్లాయి.

బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ డైరెక్ట్ చేస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' మూవీ ద‌స‌రా ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 15న విడుద‌ల‌వుతోంది. ఈలోగా థియేట్రిక‌ల్ ట్రైట‌ర్‌ను సెప్టెంబ‌ర్ 30 సాయంత్రం 6:10 గంట‌ల‌కు రిలీజ్ చేస్తున్నారు. అఖిల్ కెరీర్‌కు ఈ సినిమా స‌క్సెస్ చాలా కీల‌కం. ఇంత‌దాకా అత‌ను న‌టించగా విడుద‌లైన మూడు సినిమాలు.. 'అఖిల్‌', 'హ‌లో', 'మిస్ట‌ర్ మ‌జ్ను'.. బాక్సాఫీస్ హిట్ కాలేక‌పోయాయి. దీంతో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌'తోనైనా తొలి విజ‌యాన్ని ద‌క్కించుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నాడు అఖిల్‌. ఆ సినిమా ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది.

అఖిల్ జోడీగా టాప్ యాక్ట్రెస్ పూజా హెగ్డే న‌టిస్తున్న ఈ మూవీని అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్ని వాస్‌, వాసు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపి సుంద‌ర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ప్ర‌దీష్ వ‌ర్మ సినిమాటోగ్రాఫ‌ర్‌. ఇటీవ‌ల రిలీజ్ చేసిన "లెహ‌రాయీ" సాంగ్ సంగీత ప్రియుల‌ను బాగా ఆక‌ట్టుకుంది.