English | Telugu

దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు.. దైవం జోలికి వస్తే మేం ఖండిస్తాం!

నటసింహ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌ పవర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలకృష్ణ తన పెర్‌ఫార్మెన్స్‌తో, గర్జించే డైలాగులతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేస్తారు. నటసింహలో నుంచి నట విశ్వరూపాన్ని ఎలా బయటికి తీసుకురావాలో, దానితో ప్రేక్షకుల చేత ఎలా చప్పట్లు కొట్టించాలో బోయపాటి శ్రీనుకి బాగా తెలుసు. ఇప్పటికే ఆ మ్యాజిక్‌ను మూడు సార్లు ప్రదర్శించి ప్రేక్షకుల చేత శభాష్‌ అనిపించుకున్న ఈ ఇద్దరు పవర్‌ఫుల్‌ జంట మరోసారి ‘అఖండ2’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ‘అఖండ2’ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది చిత్ర యూనిట్‌. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను నవంబర్‌ 21న కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో అశేష అభిమానుల సమక్షంలో విడుదల చేసింది చిత్ర యూనిట్‌. కన్నడ స్టార్‌ హీరో డాక్టర్‌ శివరాజ్‌కుమార్‌ చేతుల మీదుగా ‘అఖండ2’ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు.

‘కష్టం వస్తే దేవుడు వస్తాడని నమ్మే జనాలని, కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి. అలా వాళ్లు నమ్మిన రోజు భారతదేశం తునాతునకలైపోతుంది’ అనే కాన్సెప్ట్‌తో వచ్చిన శత్రుమూకల్ని తన దైవబలంతో అఘోరా ఎలా ఎదిరించాడు, వారిని ఎలా మట్టు పెట్టాడు అనే అంశాన్ని తీసుకొని ఈ సినిమా చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రధానంగా అఘోరా పాత్ర కనిపిస్తుందని, అతని శక్తితోనే విదేశీ శక్తుల మెడలు వంచుతాడని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ఈ ట్రైలర్‌లో అఘోరా బాలకృష్ణ చెప్పిన ప్రధానమైన డైలాగులు అద్భుతంగా, ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించేలా, విజిల్స్‌ వేయించేలా ఉన్నాయి.

‘ప్రపంచంలో మీరు ఏ దేశమెళ్లినా మీకక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటుచూసినా మీకు కనిపించేది ఒక ధర్మం.. సనాతన హైందవ ధర్మం’, ‘దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు.. దైవం జోలికి వస్తే మేం ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్‌ స్ట్రైక్‌’, ‘ఇప్పటివరకు ప్రపంచ పటంలో నా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావ్‌.. ఎప్పుడూ మా దేశ విశ్వరూపాన్ని చూసుండవ్‌.. మేమొకసారి లేచి శబ్దం చేస్తే.. ఈ ప్రపంచమే నిశ్శబ్దం’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్స్‌ నభూతో నభవిష్యత్‌ అన్నట్టుగా ఉన్నాయి. ఒక్కో డైలాగ్‌కి ప్రేక్షకులకు, అభిమానులకు గూస్‌బంప్స్‌ రావడం ఖాయం అనిపిస్తుంది. ట్రైలర్‌తోనే ఇంతటి విశ్వరూపాన్ని చూపిన బాలకృష్ణ సినిమాలో తన నట విశ్వరూపంతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో అని ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా డిసెంబర్‌ 5 కోసం ఎదురుచూస్తున్నారు.

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో ఎలాంటి అంశాలు ఉండాలో, ఎలాంటి సర్‌ప్రైజ్‌లు ఉండాలో అవన్నీ ‘అఖండ2’లో ఉన్నాయని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ఫ్యాన్స్‌ కోరుకునే మాస్‌ ఎలిమెంట్స్‌, బాలకృష్ణ పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌తో, అఘోరా చూపించే నట విశ్వరూపంతో ట్రైలర్‌ ఎంతో ఆసక్తికరంగా ఉంది. బోయపాటి శ్రీను మార్క్‌ పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, ఎలివేషన్‌ షాట్స్‌.. బాలకృష్ణ మార్క్‌ యాక్షన్‌, ‘అఖండ 2: తాండవం’ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. ఎస్‌.థమన్‌ కంపోజ్‌ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి పెద్ద ప్లస్‌ పాయింట్‌ కాబోతోంది. ఒరిజినల్‌ లొకేషన్స్‌లో చిత్రీకరించిన అద్భుతమైన సీన్స్‌ ప్రేక్షకులకు కనువిందు చేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పిస్తున్నారు. ఈ సినిమాని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. డిసెంబర్‌ 5న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది ‘అఖండ2’.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.