English | Telugu

మెగా ఫ్యాన్స్ కి ట్రిపుల్ ట్రీట్..!

వచ్చే ఏడాది బాక్సాఫీస్ దగ్గర మెగా సందడి చూడబోతున్నాం. మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అప్ కమింగ్ సినిమాలు 2026లో విడుదల కానున్నాయి. అప్పుడే ఫస్ట్ సింగిల్స్ తో ఈ మూడు సినిమాలు మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వడం విశేషం.

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'మీసాల పిల్లా' సాంగ్ అక్టోబర్ లో విడుదలైంది. చార్ట్ బస్టర్ గా నిలిచిన ఈ సాంగ్ ఇప్పటికే 83 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించడం విశేషం. (Meesaala Pilla)

రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ 'పెద్ది'. ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఏఆర్ రెహమాన్ స్వరకర్తగా వ్యవహరిస్తున్న ఈ సినిమా నుంచి 'చికిరి చికిరి' అంటే సాగే ఫస్ట్ సింగిల్ నవంబర్ లో విడుదలై సోషల్ మీడియాని షేక్ చేసింది. యూట్యూబ్ ఇప్పటికే 97 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. (Chikiri Chikiri)

గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఫిల్మ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమాని 2026 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా 'దేఖ్‌లేంగే సాలా' తాజాగా విడుదలైంది. దేవి ఎనర్జిటిక్ మ్యూజిక్, భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్, పవన్ వింటేజ్ స్టెప్స్ తో ఇన్ స్టాంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. 24 గంటలలోపే దాదాపు 30 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. (Dekhlenge Saala)

మెగా హీరోలు సినిమాలలో పాటలు బాగుంటాయనే పేరుంది. ఇప్పుడు దానిని నిజం చేస్తూ.. మెగా హీరోల అప్ కమింగ్ సినిమాల ఫస్ట్ సింగిల్స్ అన్నీ హిట్ అవ్వడం మెగా ఫ్యాన్స్ బిగ్ ట్రీట్ అని చెప్పవచ్చు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.