English | Telugu

ఒకరోజు ఆలస్యంగా అఖండ2.. ఈరోజు ప్రీమియర్స్‌కు అంతా సిద్ధం!

- డిసెంబర్‌ 5 రాత్రి ప్రీమియర్స్
- 'అఖండ2' రిలీజ్‌కి తొలగిన సమస్యలు


అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అఖండ2' కొన్ని కారణాల ఒకరోజు వాయిదా పడింది. డిసెంబర్‌ 4న ప్రీమియర్‌ షోలతో ప్రారంభం కావాల్సిన అఖండ తాండవం ఒకరోజు ఆలస్యంగా రిలీజ్‌ అవుతోంది. డిసెంబర్‌ 5న ప్రీమియర్స్‌కి అంతా సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్‌ 6న యధాతథంగా సినిమా రిలీజ్‌ అవుతుంది. అయితే ఓవర్సీస్‌లో రిలీజ్‌కి ఎలాంటి ఇబ్బందులు లేవని మేకర్స్‌ చెబుతున్నారు.


'అఖండ2' డిసెంబర్‌ 5న రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చెయ్యగా, డిసెంబర్‌ 4న ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ మద్రాస్‌ హైకోర్టులో సినిమా రిలీజ్‌ని ఆపాలంటూ పిటిషన్‌ దాఖలు చేసింది. గతంలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థకు 28 కోట్ల రూపాయలు బకాయి పడినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ మొత్తం చెల్లించే వరకు సినిమాను ఆపాలని పిటిషన్‌ దారులు కోరారు. దీంతో సినిమా రిలీజ్‌ను ఆపాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.


తాజా సమాచారం మేరకు సినిమాకు సంబంధించిన ఫైనాన్సియల్‌ సమస్యలు తొలగిపోయాయని తెలుస్తోంది. రిలీజ్‌పై ఉన్న స్టేను తొలగించేందుకు అవసరమైన చెల్లింపులు మేకర్స్‌ జరిపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. శుక్రవారం మద్రాస్‌ హైకోర్టు పని సమయాలు ప్రారంభం కాగానే పిటిషన్‌ దారులు తమకు రావాల్సిన బకాయి మొత్తం అందిందని కోర్టుకు తెలియజేస్తే వెంటనే స్టే ఎత్తి వేస్తారని తెలుస్తోంది.


స్టే ఎత్తివేయగానే యధాతథంగా ప్రీమియర్స్‌, సినిమా రిలీజ్‌లను ప్లాన్‌ చేస్తారు. అంటే ఒకరోజు ఆలస్యంగా అన్ని షోలు ప్రదర్శిస్తారు. దీనికి తగ్గట్టుగానే ఆన్‌లైన్‌ బుకింగ్స్‌లో 5వ తేదీ టికెట్లు కనిపించడం లేదు. 6వ తేదీకి సంబంధించిన షోలు ఓపెన్‌ చేసి ఉన్నాయి. తాజా సమాచారం మేరకు 5వ తేదీ(శుక్రవారం) రాత్రి ప్రీమియర్స్‌తో అఖండ తాండవం ప్రారంభం కాబోతోంది. 6వ తేదీ రెగ్యులర్‌ షోలు స్టార్ట్‌ అవుతాయి.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.