English | Telugu

Akhanda 2: సంక్రాంతి బరిలో అఖండ-2... షాక్‌లో బాలయ్య ఫ్యాన్స్!

- ఓవ‌ర్సీస్ చేజారిపోయిందా?
- బాల‌య్య‌కు ఇదే తొలి అనుభ‌వం
- తీర్పు అనుకూలంగా వ‌చ్చినా స‌మ‌స్య‌లెన్నో

అఖండ2 రిలీజ్‌పై ఏర్పడ్డ వివాదంపై మద్రాస్‌ హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. ఈరోస్‌ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను 14 రీల్స్‌ చెల్లించిందని, ఈరోజుతో ఈ సమస్య పరిష్కారమవుతుందని అందరూ భావిస్తున్నారు. వాదోపవాదాలు విన్న కోర్టు ఇచ్చే తీర్పు 14 రీల్స్‌కి అనుకూలంగా వచ్చినప్పటికీ సినిమా రిలీజ్‌ విషయంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశమున్నట్టు తెలుస్తోంది.


14 రీల్స్‌, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ మధ్య ఉన్న ఆర్థిక వివాదాలను పరిష్కరించుకుంటే ఈరోజు సాయంత్రం ప్రీమియర్స్‌ పడిపోతాయి. అయితే అవి ఇండియాకి మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఓవర్సీస్‌లో 'అఖండ2'కి కేటాయించిన థియేటర్లు ఇప్పుడు అందుబాటులో లేవని తెలుస్తోంది.


అంతకుముందు బిగ్‌ రేంజ్‌లో థియేటర్లను 'అఖండ2'కి కేటాయించారు. ఒకరోజు సినిమా పోస్ట్‌పోన్‌ అవ్వడం వల్ల కొన్ని సింగిల్‌ స్క్రీన్స్‌ మాత్రమే లభించే అవకాశం ఉంది. 'అఖండ2'కి కేటాయించిన థియేటర్లను 'జూటోపియా2'తోపాటు మరో సినిమాకి కేటాయించి టికెట్స్‌ సేల్‌ చేస్తున్నారు. ఇప్పుడా థియేటర్స్‌లో 'అఖండ2' చిత్రానికి షోలు తెచ్చుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఇలాంటి పరిస్థితుల్లో వున్న ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూటర్లు ఒక వారం తర్వాత 'అఖండ2' చిత్రాన్ని రిలీజ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.


ఒకరోజు పోస్ట్‌ పోన్‌ అయినప్పటికీ ఇప్పుడు రిలీజ్‌ చేసుకోగలిగితే ఓకే.. లేదంటే మళ్ళీ డిసెంబర్‌ 12కి ప్రయత్నం చెయ్యాల్సి ఉంటుంది. అది కూడా మిస్‌ అయితే డిసెంబర్‌ 19కి వెళ్లాలి. అదే టైమ్‌కి 'అవతార్‌3' రిలీజ్‌కి రెడీగా ఉంది. ఇండియాలో పరిస్థితి ఎలా ఉన్నా.. ఈరోజు అంటే డిసెంబర్‌ 5 శుక్రవారం ఓవర్సీస్‌లో 'అఖండ2' రిలీజ్‌ లేనట్టే అనుకోవాలి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బాలయ్యబాబు సినిమా ఈరోజు అక్కడ రిలీజ్‌ అవ్వదు. సో.. ఈ పరిస్థితులను చూసి దర్శకనిర్మాతలు 'అఖండ2' ని సంక్రాంతి బరిలో దించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.సో.. ఈ పరిస్థితులను చూసి దర్శకనిర్మాతలు 'అఖండ2' ని సంక్రాంతి బరిలో దించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వార్త వచ్చినప్పటి నుంచి బాలయ్య ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారట.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.