English | Telugu

చిరుని వాడేసుకుంటున్న కొత్త జంట

చిరంజీవి నటించిన "ఖైదీ నెం 786" చిత్రంలో "అటు అమలాపురం..." పాట ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అయితే ఈ పాటను ప్రస్తుతం రీమేక్ చేస్తున్నారు. అల్లు శిరీష్, రేజీనా కలిసి నటిస్తున్న తాజా చిత్రం "కొత్త జంట". మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు పాటను రీమేక్ చేస్తున్నారు. ఈ పాటలో హీరోయిన్ మధురిమ నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ సారధి స్టుడియోలో జరుగుతుంది. గణేష్ మాస్టర్ నేతృత్వంలో ఈ మాస్ మసాలా పాటను చిత్రీకరిస్తున్నారు. బన్నీ వాసు మరియు గీత ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.