English | Telugu
పవన్ కి మైనస్.. మరి వరుణ్ సంగతేంటో !
Updated : Apr 6, 2022
`ఎఫ్ 2`, `గద్దలకొండ గణేశ్` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. `గని`తో హ్యాట్రిక్ ని టార్గెట్ చేసుకున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బాక్సర్ గా ఎంటర్టైన్ చేయనున్నాడు వరుణ్ తేజ్. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన `గని`.. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 8న విడుదలకు సిద్ధమైంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో ఇదే తేదిన వరుణ్ తేజ్ బాబాయ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓ సినిమా రిలీజై పరాజయం పాలైంది. ఆ చిత్రమే.. `సర్దార్ గబ్బర్ సింగ్`. 2016 వేసవి కానుకగా ఏప్రిల్ 8న వచ్చిన `సర్దార్ గబ్బర్ సింగ్`.. అప్పట్లో మెగాభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో.. ఆరేళ్ళ తరువాత అదే తేదికి వస్తున్న వరుణ్ `గని` అయినా విజయపథంలో పయనిస్తుందేమో చూడాలి.
కాగా, `గని`లో సయీ మంజ్రేకర్ కథానాయికగా నటించగా ఉపేంద్ర, జగపతి బాబు, సునీల్ శెట్టి, నదియా, నవీన్ చంద్ర ఇతర ముఖ్య పాత్రల్లో అభినయించారు. యువ సంగీత సంచలనం తమన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఓ ప్రత్యేక గీతంలో చిందులేసింది.