English | Telugu
విక్టరీ వెంకటేష్ ని సైకో అంటున్న నవాజ్ సిద్ధికి
Updated : Oct 16, 2023
విక్టరీ వెంకటేష్ అనే పేరు వింటే ఆయన అభిమానులు ఎంతగా ఆనందంతో పులకిరించి పోతారో సినీ అభిమానులు కూడా అంతే ఆనందంతో పులకరించి పోతారు. తెలుగు సినిమా అగ్ర హీరోల్లో ఒకరైన వెంకటేష్ దాదాపుగా కళ కి సంబంధించి ఎన్ని పాత్రలు ఉంటాయో అన్ని పాత్రలని ఆయన పోషించారు. ఇప్పుడు తాజాగా సైంధవ్ అనే మూవీ తో పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటడానికి వస్తున్నాడు. ఈ సైంధవ్ మూవీ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ప్రస్తుతం సినీ సర్కిల్స్ లో ఈ టీజర్ సంచలనం సృష్టిస్తుంది.
కలియుగ పాండవులు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో కి ఎంటర్ అయిన వెంకటేష్ ఆ తర్వాత ఎన్నో విభిన్నమైన సినిమాల్లో నటించి లక్షలాదిమంది అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. స్వర్ణ కమలం,చంటి ,సుందర కాండ ,శత్రువు, ధర్మ చక్రం, సాహస వీరుడు సాగర కన్య, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం,పెళ్లి చేసుకుందాం,ప్రేమించుకుందాం రా, క్షణ క్షణం, ఆడవారి మాటలకి అర్ధాలు వేరులే, కూలి నెంబర్ వన్, బొబ్బిలి రాజా, మల్లేశ్వరి, గణేష్ ,దృశ్యం ,సూర్య వంశం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విభిన్న సినిమా లు. ఒక సినిమా సబెక్టు కి ఇంకో సినిమా సబ్జెక్టు కి సంబంధమే ఉండదు. అందుకే ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నెంబర్ వన్ వన్ హీరో గా చెలామణి అయ్యారు.అసలు ఇండియన్ తెలుగు సినిమా హిస్టరీ లో వరుసగా ఐదు సినిమాలు శతదినోత్సవం జరుపుకున్న ఏకైక హీరో వెంకటేష్ మాత్రమే.
ఇప్పుడు సైంధవ్ గా తన అభిమానులని అలరించడానికి రాబోతున్నాడు. తన చంటి సినిమా తో ఎప్పుడో పాన్ ఇండియా హీరో అయిన వెంకటేష్ ఇప్పుడు మరోసారి పాన్ ఇండియా హీరో గా భారతీయ సినీ పేక్షకులకి తన సత్తా చూపించబోతున్నారు.సైంధవ్ టీజర్ లో వెంకటేష్ లుక్ తో పాటు ఆయన చెప్పిన డైలాగ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. టీజర్ ఎంట్రీ లో వెంకటేష్ తన ఫ్యామిలీ తో సరదాగా గడుతూ ఉన్నాడు. ఆతర్వాత నవాజున్ సిద్ధికి ఎంట్రీ ఇచ్చి కొంత మందిని చంపుతాడు. ఆ తర్వాత వెంకటేష్ తన ఉగ్ర రూపాన్ని చూపిస్తూ కొంత మంది రౌడీ లని చంపడంతో పాటు మెయిన్ విలన్స్ తో వెంకీ చెప్పిన మాటలు ఒక రేంజ్ లో ఉన్నాయి. వెళ్లే ముందు చెప్పి వెల్లా వినలేదు.. అంటే భయం లేదు.. లెక్క మారుద్ది నాకొడకల్లారా అని వెంకటేష్ చెప్పే డైలాగ్ అయితే గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. అలాగే విలన్స్ అందరు వెంకటేష్ ని సైకో గా సంబోధించడం తోనే శత్రువుల మీద వెంకటేష్ ఉగ్ర రూపం మొదలవుతుంది. సినిమా టీజర్ ని చూస్తుంటే వెంకటేష్ దేశాన్ని రక్షించే పాత్రలో చేస్తున్నట్టుగా ఉంది. అలాగే ఒక ప్లేస్ లో కూర్చొని నోటిలో కత్తి పెట్టుకొని తన చేతికి ఎర్రటి క్లాత్ ని చుట్టుకోవడం అయితే నిజంగా సూపర్. రేపు విక్టరీ వెంకటేష్ అభిమానుల అరుపులతో థియేటర్స్ బద్దలు అవ్వడం ఖాయం.సైంధవ్ టీజర్ సూపర్ గా ఉంది మీరు ఒక లుక్ వెయ్యండి.
