English | Telugu
నేడు చింతకాయల రవి పుట్టినరోజు
Updated : Dec 13, 2013
టాలీవుడ్ అగ్ర హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకొని,విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్న ఏకైక హీరో వెంకటేష్. చిత్ర పరిశ్రమకు నాలుగు మూల స్తంభాలుంటే... అందులో ఒకరు వెంకటేష్. "కలియుగ పాండవులు" చిత్రంతో తెలుగుతెరకు హీరోగా పరిచయమయిన వెంకటేష్.. ఆ తరువాత క్లాస్, మాస్, యాక్షన్, సెంటిమెంట్ అనే తేడాలు లేకుండా అన్ని చిత్రాల్లో నటించి, నటుడిగా తన సత్తా ఏంటో చాటుకున్నాడు.
"చంటి" వంటి అమాయకుడి పాత్రలో నటించి కంటతడి పెట్టించినా, "ప్రేమించుకుందాం రా" అంటూ ప్రేమికుల మనసు దోచుకున్నా.."నువ్వునాకు నచ్చావ్" వంటి చిత్రాల్లో తనదైన నటనతో నవ్వించినా, "ఘర్షణ" వంటి వాటితో తనలో యాక్షన్ ను చూపించిన కూడా అవన్నీ ఆయనకే చెల్లినవి.
తన తండ్రి, అన్నయ్య ఒక పెద్ద నిర్మాతలు అనే భావన ఎప్పుడు కూడా లేకుండా మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ఇప్పటికి కూడా కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నాడు వెంకటేష్. హీరోగా మాత్రమే కాకుండా మల్టీస్టారర్ చిత్రాలను ప్రోత్సహించడంలో కూడా వెంకటేష్ ముందు స్థానంలో ఉన్నాడని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం వెంకటేష్ హీరోగా "రాధ", హిందీ రీమేక్ "ఓ మై గాడ్" చిత్రాలలో నటించబోతున్నారు. అదే విధంగా రాంచరణ్ తో కూడా ఓ మల్టీస్టారర్ చిత్రం కూడా చేయనున్నాడు. మరి ఇలాంటి స్టార్ ఇమేజ్ ను పెట్టుకొని కూడా సాదాసీదాగా, మాములు మనిషి ఆలోచించే ఆలోచన విధానాలతో, అందరితో స్నేహ భావంగా ఉండే ఈ "బొబ్బిలి రాజా" పుట్టినరోజు నేడు.
ఈ సందర్భంగా "చింతకాయల రవి"కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగువన్.కామ్