English | Telugu
వినూత్న రీతిలో గుర్రం పాటలు
Updated : Dec 13, 2013
సుమంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "ఏమో గుర్రం ఎగరావచ్చు". చంద్రసిద్దార్థ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని బ్యాంకాక్ లో వినూత్న రీతిలో ఆవిష్కరించారు. ఒక పాటను జలాంతర్గామిలో, మరో పాటను పారాశూట్ లో గాల్లో ఎగురుతూ, మరో పాట షాపింగ్ మాల్లో... ఇలా తొమ్మిది వేర్వేరు ప్రాంతాల్లో విడుదల చేసారు. థాయ్ యుసీఐ మీడియా హౌస్ హెడ్ చాతుపోన్, అయన శ్రీమతి పసద్ధ కలిసి ఆడియో సిడిలను విడుదల చేసారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో పింకీ సావిక హీరోయిన్ గా నటించింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.