English | Telugu

కొత్తరకం ప్రేమికుడిగా చైతు

నాగచైతన్య హీరోగా మరో చిత్రం ప్రారంభమయ్యింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్ లో జరిగాయి. ఈ సినిమా గురించి నాగచైతన్య మాట్లాడుతూ.. "దర్శకుడు చెప్పిన కథ కొత్తగా ఉంది. ప్రేమకథా చిత్రాల్లో ఇది ఒక కొత్తరకం. అందరిని అలరించే విధంగా ఉంటుంది" అని అన్నారు. ఈ నెల 23నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. నాగచైతన్య ప్రస్తుతం "ఆటోనగర్ సూర్య", "మనం" చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి.