English | Telugu
'కళావతి' రికార్డును బ్రేక్ చేసిన 'అరబిక్ కుత్తు'!
Updated : Feb 15, 2022
మహేశ్‌బాబు 'సర్కారువారి పాట' నుంచి రిలీజ్ చేసిన తొలి లిరికల్ సాంగ్ 'కళావతి' సూపర్ పాపులర్ అయ్యి, 24 గంటల్లో కేవలం తెలుగు పాటల్లోనే కాకుండా సౌత్ ఇండియన్ సాంగ్స్‌లోనే రికార్డు బ్రేక్ వ్యూస్ సాధించింది. 'కళావతి' సాంగ్ 24 గంటల్లో 16 మిలియన్ వ్యూస్ సాధించినట్లు నిర్మాతలు అధికారికంగా తెలియజేశారు. తమన్ స్వరాలు కూర్చిన ఈ సాంగ్‌ను సిద్ శ్రీరామ్ ఆలపించాడు. అదివరకు రికార్డు 'పుష్ప'లోని 'ఊ అంటావా మావా' సాంగ్ పేరుతో ఉంది.
అయితే ఒక్కరోజు గడిచిందో, లేదో కళావతి పాట రికార్డును విజయ్ ఫిల్మ్ 'బీస్ట్'లోని 'అరబిక్ కుత్తు' సాంగ్ తిరగరాసింది. 24 గంటల్లో ఈ పాట 17 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసింది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్‌ను హీరో శివకార్తికేయన్ రావడం విశేషం. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేస్తోన్న బీస్ట్ మూవీలో 'అరబిక్ కుత్తు' సాంగ్‌ను హీరో హీరోయిన్లు విజయ్, పూజా హెగ్డేపై చిత్రీకరించారు. వేలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న దీన్ని యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు.
పెప్పీ ట్యూన్, హీరో హీరోయిన్ల లుక్స్, వారి డాన్స్ స్టెప్స్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. విజయ్, పూజా జోడీ చాలా హాట్‌గా కనిపిస్తోందంటూ వారు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. 24 గంటల్లో 17 మిలియన్ వ్యూస్‌ను రాబట్టిన ఈ సాంగ్ ఇప్పటికీ ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న 'బీస్ట్' మూవీ ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్‌గా రిలీజవుతోంది. ఈ మూవీలో సెల్వరాఘవన్, యోగిబాబు, అపర్ణా దాస్, షైన్ టామ్ చాకో, రెడిన్ కింగ్‌స్లే కీలక పాత్రలు పోషించారు.
