English | Telugu
పోలీసోడి భార్యతో ఎఫైర్.. ఇదేం సంస్కారం?
Updated : Feb 15, 2022
'సొంత ఊరు', 'గంగపుత్రులు' వంటి అవార్డు విన్నింగ్ సినిమాలు తీసిన దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డికి ఏమైంది?. తన సినిమాలలో రొమాన్స్ ఉంటుంది కానీ వల్గారిటీ ఉండదు అని చెప్పిన ఆయన తన మాటని మరిచారా?. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన '69 సంస్కార్ కాలనీ' మూవీ ట్రైలర్ చూస్తే ఇది నిజంగా సునీల్ కుమార్ రెడ్డి తీసిన సినిమానేనా అనే అనుమానం కలుగుతుంది.
ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్ ప్రధాన పాత్రల్లో పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా '69 సంస్కార్ కాలనీ'. మార్చి 4న విడుదలకు సిద్ధమైన ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఎస్తర్, అజయ్ భార్యాభర్తలు. అయితే ఎస్తర్(వైశాలి) అదే కాలనీలో ఉండే ఒక కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంటుంది. పోలీస్ ఆఫీసర్ అయిన అజయ్ డ్యూటీకి వెళ్ళగానే.. ఆ కుర్రాడు వాళ్ళ ఇంటికెళ్లి ఆమెతో శృంగారం చేస్తుంటాడు. ఆ సన్నివేశాలు మరీ ఇబ్బందికరంగా, బీ గ్రేడ్ సినిమాలను గుర్తు చేసే విధంగా ఉన్నాయి. ఒకసారి అజయ్ ఇంటికి తిరిగొచ్చేసరికి.. అతని భార్య ఆ కుర్రాడితో గడుపుతూ కనిపిస్తుంది. దీంతో అజయ్ అతన్ని కొట్టడం, తన పెళ్ళాన్ని వదిలేయమని అడగటం వంటి సన్నివేశాలు ట్రైలర్ లో కనిపించాయి. అంతేకాదు, ఆ కుర్రాడు మరో అమ్మాయితో బెడ్ మీద ఉండి.. వైశాలికి తనంటే ప్రాణమని, కానీ ఆమె భర్త ఒప్పుకోవట్లేదని చెప్పే సన్నివేశం కూడా ట్రైలర్ లో చూపించారు.
సునీల్ కుమార్ రెడ్డి సినిమా అంటే ఏదోక మెసేజ్ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా వివాహేతర సంబంధం తప్పు అని మెసేజ్ ఇస్తారు అనడంలో సందేహం లేదు. కానీ సినిమా అంతా ఇలా ఇబ్బందికర సన్నివేశాలు చూపించి, చివరిలో మెసేజ్ ఇస్తే ఏం ప్రయోజనం?. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే మాత్రం అవార్డు విన్నింగ్ సినిమాలు తీసిన సునీల్ కుమార్ రెడ్డి నుంచి రావాల్సిన సినిమా అయితే కాదనే అభిప్రాయం కలుగుతుంది.
