English | Telugu
మహేష్ బాబు దూకుడు ఆగస్ట్ 12 న
Updated : Jun 10, 2011
మహేష్ బాబు "దూకుడు" ఆగస్ట్ 12 న విడుదల కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, "ఏమాయ చేశావే" ఫేం సమంత హీరోయిన్ గా, శ్రీనువైట్ల దర్శకత్వంలో, అనీల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న సినిమా "దూకుడు". ప్రస్తుతం మహేష్ బాబు "దూకుడు" సినిమా నిజానికి మొన్న వేసవిలోనే విడుదలవుతుందని మహేష్ బాబు తన అభిమానులకు గతంలో మాట ఇచ్చారు.
కానీ ఫెడరేషన్ సమ్మె వంటి అనుకోని అవాంతరాలవల్ల మహేష్ బాబు "దూకుడు" అనివార్యంగా ఆలస్యమయ్యింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అల్ల్యూమినియం ఫ్యాక్టరీలో విలన్ సోనూ సూద్, హీరో మహేష్ బాబు ల మధ్య ఫైట్ మాస్టర్ విజయ్ ఆధ్వర్యంలో యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్నారు. మరో నాలుగు రోజుల పాటు అక్కడే షూటింగ్ జరుపుకుంటుంది. మహేష్ బాబు "దూకుడు" సినిమా ఆగస్టులో పన్నెండవ తేదీన విడుదల కానుందట.