English | Telugu

బాలకృష్ణ మహాదేవనాయుడు నవంబర్ లో

బాలకృష్ణ "మహాదేవనాయుడు" నవంబర్ లో రిలీజ్ కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై, యువరత్న నందమురి బాలకృష్ణ హీరోగా త్రిపాత్రాభినయం చేస్తూండగా, ఛార్మి, లక్ష్మీరాయ్, సలోనీ హీరోయిన్లుగా, పరుచూరి మురళి దర్శకత్వంలో, యమ్.యల్.కుమార్ చౌదరి నిర్మిస్తున్న చిత్రానికి "మహాదేవనాయుడు" అన్న పేరుని నిర్ణయించారని సమాచారం. బాలకృష్ణ "మహాదేవనాయుడు" సినిమాని నవంబర్ నెలలో విడుదల చేయటానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

బాలకృష్ణ "మహాదేవనాయుడు" సినిమాకి "అలా మొదలయ్యింది"ఫేం కళ్యాణిమాలిక్ చక్కని సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో ఇంకా జయసుధ, చరణ్ రాజ్, బ్రహ్మానంద, కోట శ్రీనివాసరావు తదితరులు నటిస్తున్నారు. విజయ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ బాలకృష్ణ "మహాదేవనాయుడు" సినిమాలో హీరో బాలకృష్ణ ఒక తెలివైన జర్నలిస్ట్ గా, ఒక కరుడు కట్టిన ఫ్యాక్షనిస్టుగా, ఒక శాంతి కాముకుడిగా తాత, తండ్రి, కొడుకుగా ముడు పాత్రల్లో నటిస్తున్నారు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.