English | Telugu
సుడిగాడు పై కన్నేసిన జెనీలియా భర్త
Updated : Jul 30, 2013
అల్లరి నరేష్ హీరోగా నటించిన "సుడిగాడు" చిత్రం త్వరలో బాలీవుడ్ కి వెళ్లనుంది. పూర్తి కామెడి ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇటీవలే బాలీవుడ్ నటుడు, జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ చూసాడట. ఈ చిత్రం చాలా బాగా నచ్చడంతో ఈ చిత్ర హిందీ రీమేక్ లో ఎలాగైనా నటించాలని రితేష్ అనుకుంటున్నాడట.
అయితే ఇటీవలే "సుడిగాడు" చిత్ర హిందీ వర్షన్ హక్కులను బాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ నిర్మాత సొంతం చేసుకున్నట్లు తెలిసింది. రితేష్ ఈ చిత్రంపైన చూపిస్తున్న ఆసక్తిని చూసి, ఆ నిర్మాత కూడా ఈ చిత్రాన్ని రితేష్ తో తీయాలనే ఆలోచనలో ఉన్నాడట.