English | Telugu

హిందీలో రీమేక్ కానున్న "తడాఖా"

తమిళ విజయం సాధించిన "వెట్టై" చిత్రాన్ని, తెలుగులో నాగచైతన్య, సునీల్ హీరోలుగా "తడాఖా" పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగులో కూడా విజయం సాధించడంతో.. ఈ చిత్రంపై బాలీవుడ్ కన్ను పడింది.

ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. మరి ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.