English | Telugu

ప్రభాస్ 'ఫౌజీ' సర్ ప్రైజ్.. బిగ్ లీక్ ఇచ్చిన సుధీర్ బాబు!

నవంబర్ 7న జటాధర
తెలుగువన్ కి సుధీర్ బాబు ఇంటర్వ్యూ
ప్రభాస్ 'ఫౌజీ' గురించి బిగ్ అప్డేట్

హను రాఘవపూడి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఫౌజీ' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు నాటి కథతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. 'ఫౌజీ' సినిమాలో ప్రభాస్ చిన్నప్పటి పాత్రలో సుధీర్ బాబు చిన్న కొడుకు దర్శన్ నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఆ వార్తలు నిజమేనని తాజాగా 'తెలుగువన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధీర్ బాబు క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, 'ఫౌజీ' మూవీలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతుందో తెలిపేలా బిగ్ అప్డేట్ ని రివీల్ చేశారు.

సుధీర్ బాబు హీరోగా నటించిన 'జటాధర' సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. 'ఫౌజీ' గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సుధీర్ బాబు. "ఫౌజీలో మా అబ్బాయి నటిస్తున్న వార్త నిజమే. ప్రోపర్ ఆడిషన్ కి వెళ్ళి సెలెక్ట్ అయ్యాడు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేదాలు నేర్చుకున్నాడు. డైరెక్టర్ హను గారు మంత్రాలు నేర్చుకోవాలని ఒక లిస్టు ఇచ్చారు. ప్రత్యేకంగా ఓ పూజారిని పెట్టించి, వాటిని ప్రోపర్ గా పలకడం నేర్పించడం జరిగింది. వేదాల గురించి ఏకధాటిగా మూడు నాలుగు నిమిషాలు మాట్లాడాలి. అవన్నీ నేర్చుకొని ఆడిషన్ కి వెళ్ళి సెలెక్ట్ అయ్యాడు." అని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు.

Also Read: 'బాహుబలి: ది ఎపిక్' కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి అయినదొక్కటి..!

'ఫౌజీ' సినిమాలో ప్రభాస్ బ్రాహ్మణ యువకుడిగా, సైనికుడిగా రెండు కోణాల్లో కనిపిస్తారని గతంలో న్యూస్ వినిపించింది. తాజాగా సుధీర్ బాబు కామెంట్స్ ని బట్టి చూస్తే.. అది నిజమే అనిపిస్తోంది. ప్రభాస్ చిన్నప్పటి పాత్రలో సుధీర్ తనయుడు నటిస్తున్నాడు. ఆ పాత్ర కోసం మంత్రాలు నేర్చుకున్నాడంటే అది బ్రాహ్మణ పాత్ర అని అర్థమవుతోంది. ఈ లెక్కన బ్రాహ్మణ యువకుడి పాత్రలో ప్రభాస్ నటించడం నిజమేనని స్పష్టమవుతోంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.