English | Telugu
Guntur Kaaram Song Leaked: ‘గుంటూరు కారం’ లీక్ పాటపై సోషల్ మీడియాలో రచ్చ!
Updated : Nov 4, 2023
మహేష్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గుంటూరు కారం’ చిత్రానికి అన్నీ కష్టాలే. మొదటి నుంచీ ఈ సినిమాకి సంబంధించి ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో చర్చగా మారుతూ వస్తోంది. గతంలో ఈ సినిమా యూనిట్ నుంచి ఒక్కొక్కరు బయటికి వచ్చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే ఆర్టిస్టుల్లో, టెక్నీషియన్స్‌లో చాలా మార్పులు జరిగాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విషయానికి వస్తే.. తమన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడనే వార్త వచ్చింది. అయితే ఈ సినిమాకి తనే మ్యూజిక్ డైరెక్టర్ అనీ, తాను ఎక్కడికీ వెళ్లిపోలేదని తనే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఇలా ఒక దాని తర్వాత మరొకటి అన్నట్టు అన్నీ సోషల్ మీడియాలో పెద్ద రచ్చగా మారాయి. కొత్తగా ‘గుంటూరు కారం’ చిత్రంలోని పాట లీక్ అయింది. ఇప్పుడు ఈ పాటపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి,
నిజానికి ఈ సినిమాలోని మొదటి పాటను అఫీషియల్‌గా రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ, ఈలోగా పాట నెట్టింట ప్రత్యక్షమైంది. లీక్ అయిన ఈ పాట గురించి నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది పాట చాలా బాగుంది అంటుంటే, మరికొందరు చాలా చెత్తగా ఉంది అంటున్నారు. గతంలో మహేష్, తమన్ కాంబినేషన్‌లో వచ్చిన దూకుడు, బిజినెస్ మ్యాన్, ఆగడు, సర్కారు వారి పాట సినిమాల్లోని సాంగ్స్ చాలా బాగుంటాయి. కానీ, ‘గుంటూరు కారం’ చిత్రంలోని లీక్ అయిన ఈ పాట మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతోందనే చెప్పాలి. ఈ విషయంలో తమన్‌ని టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు. మళ్లీ అవే డ్రమ్స్ మ్యూజిక్ చేశాడని కొందరు, తన ట్యూన్స్ తానే కాపీ కొట్టుకుంటున్నాడని కొందరు కామెంట్ చేస్తున్నారు, మరికొందరు మాత్రం తమన్ ఎప్పట్లాగే రాడ్డు దింపాడు అంటున్నారు. వాస్తవానికి తమన్ ఇచ్చే ప్రతి ట్యూన్ కూడా కాపీ అంటూ చాలా రకాల చర్చలు జరుగుతాయి. ప్రతి సినిమా ఆడియో విషయంలో తమన్‌ని విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. అయినా మేకర్స్ తమన్‌ని మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎలా తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. లీక్ అయిన ఈ సాంగ్ అసలు సినిమాలోని పాట కాదని, ప్రైవేట్ సాంగ్ అని కొందరు, సినిమాలోని పాటేనని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సాంగ్‌పై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే ఇది సినిమాలోని పాటే అయితే ఇప్పటివరకు సినిమా మీద ఉన్న అంచనాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా మహేష్ సినిమాల్లోని పాటలు బాగుంటాయి. సినిమాకి ప్లస్ అవుతాయి కూడా. మరి ఇలాంటి రాడ్ సాంగ్స్ చూడాలంటే మాత్రం ప్రేక్షకులకి ఇబ్బంది కలుగుతుంది అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పాట సినిమాలోనిదా లేక ప్రైవేట్ సాంగా అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగక తప్పదు.