English | Telugu

వివాదంలో యన్ టి ఆర్ శక్తి

యన్ టి ఆర్ "శక్తి" చిత్రం వివాదాల్లో ఇరుక్కుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే వైజయంతీ మూవీస్ పతాకంపై, యంగ్ టైగర్, ఎ-1 స్టార్ యన్ టి ఆర్ హీరోగా, నలకనడుము ఇలియానా హీరోయిన్ గా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో, అశ్వనిదత్ నిర్మించిన చిత్రం "శక్తి". ఈ యన్ టి ఆర్ హీరోగా నటిస్తున్న"శక్తి" చిత్రం ప్రస్తుతం ఒక వివాదంలో ఇరుక్కుందని ఫిలిం నగర్‍ వర్గాలంటున్నాయి. ఈ చిత్రంలో హీరో యన్ టి ఆర్ కాళ్ళకి వేసుకున్న బూట్లకు మూడు రంగులున్నాయట. అది మన దేశ జాతీయ పతాకాన్ని అవమానించినట్లుగా భావిస్తున్నట్లు కొందరు సైనికోద్యోగులు భావిస్తున్నారు.


దీని మీద నిర్మాత, దర్శకులు స్పందించి వివరణ ఇవ్వాలని ఆ సైనికోద్యోగులు కోరుతున్నారు. హీరో ఈ విషయంపై ఎలా స్పందిస్తారో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ యన్ టి ఆర్ "శక్తి" అష్టదశ శక్తి పీఠాల గురించి చక్కని కమర్షియల్ హంగులతో నిర్మించిన చిత్రంగా నిర్మాత అశ్వనీ దత్ మీడియాకు తెలిపారు. ఈ చిత్రం "ఆల్ ఫూల్స్ డే" రోజున అంటే ఏప్రెల్ 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబడుతూంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.