English | Telugu
హార్ట్ ఎటాక్ పని అయిపొయింది
Updated : Nov 30, 2013
తెలుగు సినిమా ఇండస్ట్రీలో త్వరగా సినిమా పూర్తి చేసే ఏకైక దర్శకుడు పూరి జగన్నాథ్. ఈయన ఎప్పుడు సినిమా స్టార్ట్ చేస్తాడో ఎప్పుడు ముగించేస్తాడో ఎవరికీ తెలియదు. కానీ కేవలం మూడు నెలలలోపే సినిమాను పూర్తి చేయడం ఈయన ఒక్కడికే చెల్లింది. ప్రస్తుతం పూరి దర్శకత్వంలో "హార్ట్ ఎటాక్" అనే చిత్రం రూపొందుతుంది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ గోవాలో పూర్తి చేసుకుంది. త్వరలోనే ఆడియో విడుదల చేసి, సినిమాను కూడా అతి త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై పూరి స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నితిన్, ఆదాశర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అనూప్ సంగీతాన్ని అందిస్తున్నాడు.