English | Telugu

జింతాత జిత జిత అంటున్న మాస్ రాజా

రవితేజ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి "జింతాత జిత జిత " అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలిసింది. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇటీవలే ముహూర్త కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ చిత్ర షూటింగ్ ఒక పాట చిత్రీకరణకు సిద్దంగా ఉంది. "దేవుడా దేవుడా.." అంటూ సాగే ఈ పాటను కొరియోగ్రాఫర్ విష్ణుదేవా నేతృత్వంలో చిత్రీకరించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. హన్సిక హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మరో "విక్రమార్కుడు" రేంజ్ లో ఉండబోతుంది.