English | Telugu

సమంతకు చుక్కలు చూపెడుతున్న ప్రిన్స్ ఫ్యాన్స్

సమంత ఈ మధ్య ప్రతి విషయాన్ని కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ సంబరపడిపోతుంది. అయితే తాజాగా ఈమె చేసిన కామెంట్ మహేష్ అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తుంది. ఈవిడ చేసిందే ఎక్కువ అని అనుకుంటే.. ఈమెకు తోడుగా ఈమె ప్రియుడు సిద్ధార్థ్ కూడా సమంతను సపోర్ట్ చేయడంతో...ఆవేశంతో ఉన్న మహేష్ అభిమానులు వీళ్ళిద్దరిని టాలీవుడ్ నుండి పంపించేయాలంటూ సమంత, సిద్దార్థ గెట్ లాస్ట్ అంటూ వారిపై ట్వీట్ల వర్షం కురిపించారు.

అసలు వీళ్ళిద్దరూ అంతపని ఏం చేసారంటే....మహేశ్ నటించిన ‘1-నేనొక్కడినే' పోస్టర్‌ విడుదలైంది. అయితే..సదరు పోస్టర్‌లో ఆడవాళ్లను కించపరిచే విధంగా ఇమేజ్‌లు వున్నాయంటూ హీరోయిన్ సమంత తన ట్విట్టర్లో కామెంట్ చేసిందట. కానీ సినిమా పేరు మాత్రం ఆమె పేర్కొనలేదు. సమంత ఏం ట్వీట్ చేసిందంటే... "విడుదలకు సిద్ధమవుతున్న ఓ సినిమా పోస్టర్‌ ఈ మధ్య చూశాను. ఆ పోస్టర్‌లో హీరో, హీరోయిన్స్‌ని చూస్తుంటే మహిళల గౌరవాన్ని దిగజార్చేలా ఉంది" అని పోస్ట్ చేసింది. ఈమెకు తోడుగా సిద్ధార్థ్ ... "Agree or disagree all you want. The moment you question anyone's right to an opinion, well that just makes you a bully, a terrorist even," అంటూ ట్వీట్ చేసాడు. ఈ కామెంట్లకు మహేష్ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు.