English | Telugu
కొన్ని గంటల్లో మహేష్ సునామి రాక
Updated : Dec 19, 2013
మహేష్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "1" చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ అంచనాలను మరింతగా పెంచే విధంగా ఇటీవలే విడుదలైన ఆడియో టీజర్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. మహేష్ తో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి అవడంతో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే పాటలను అందించాడు. ఇప్పటికే విడుదలైన రెండు బిట్ సాంగ్స్ టీజర్స్ అదిరిపోయే రేంజులో సినిమా సత్తాను చూపెడుతుంది.
నేడు (డిసెంబర్ 19)ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని భారీగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు ప్రొడ్యూసర్. హైదరాబాద్‌లో జరిగే ఈ వేడుక ఏపీలో కొన్ని ముఖ్యమైన కేంద్రాల్లో ఆడియో ఫంక్షన్‌ని లైవ్‌గా థియేటర్లలో ప్రసారం చేయబోతున్నారు.
14రీల్స్ బ్యానర్లో అనిల్ సుంకర, గోపి ఆచంట, రామ్ ఆచంట కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.