English | Telugu

Mass Jathara: రవితేజ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అంతలోనే మరో ట్విస్ట్!

- రవితేజ ఫ్యాన్స్ కి ఒకేసారి గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్
- ఒకరోజు ఆలస్యంగా మాస్ జాతర..?
- ట్రైలర్ లాంచ్ ఈవెంట్ క్యాన్సిల్
- ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా ఆ స్టార్ హీరో

మాస్ మహారాజా రవితేజ (RaviTeja) ఫ్యాన్స్ నిరాశచెందేలా ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. అంతలోనే వారిని హ్యాపీ చేసేలా ఓ గుడ్ న్యూస్ కూడా వచ్చింది. ఇంతకీ ఆ న్యూస్ ఏంటో చూద్దాం. (Mass Jathara)

2022లో వచ్చిన 'ధమాకా' తర్వాత హిట్ కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజా రవితేజ.. ఈ వారం 'మాస్ జాతర'తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భాను బోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అక్టోబర్ 31న 'బాహుబలి' రీ-రిలీజ్ అవుతుండటంతో.. ఒకరోజు ఆలస్యంగా వచ్చే అవకాశముంది అంటున్నారు. ఇది చాలదు అన్నట్టు.. అక్టోబర్ 27న తలపెట్టిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయింది. దీంతో రవితేజ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే వారిలో ఉత్సాహాన్ని నింపేలా.. తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

Also Read:మరోసారి వాయిదా పడిన మాస్ జాతర!

'మాస్ జాతర' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ క్యాన్సిల్ అయినప్పటికీ.. ట్రైలర్ విడుదలలో ఎలాంటి మార్పు లేదు. సోమవారం సాయంత్రం ట్రైలర్ విడుదలవుతోంది. అంతేకాదు, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి బదులుగా.. అక్టోబర్ 28న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కోలీవుడ్ స్టార్ సూర్య హాజరుకాబోతున్నారు.

సూర్య తన 46వ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో చేస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సితార బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్న సూర్య.. అదే బ్యానర్ నుండి వస్తున్న మరో సినిమా 'మాస్ జాతర' ప్రమోషన్స్ లో భాగం కాబోతున్నారు అన్నమాట.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.