English | Telugu

మళ్ళీ వెనక్కి తగ్గిన 'రామారావు'

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రజిషా విజయన్, దివ్యాంషు కౌశిక్ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ'ని మార్చి 25 లేదా ఏప్రిల్ 15న విడుదల చేస్తామని గతంలో మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత జూన్ 17న మూవీని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఈ తేదీకి కూడా రావట్లేదని తాజాగా ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం పడుతున్న కారణంగా జూన్ 17న సినిమాని విడుదల చేయట్లేదని, కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు.

కాగా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో 'ధమాకా', సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' సినిమాలు చేస్తున్నాడు. ఆ తర్వాత 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ పట్టాలెక్కనుంది. వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తున్న 'వాల్తేరు వీరయ్య'లోనూ కీలక పాత్రలో సందడి చేయనున్నాడు.