English | Telugu

సాయంత్రం 5 :30 కి రజనీ,కమల్ ల సంచలనం

తమినాడు చిత్ర పరిశ్రమలో ఇప్పుడొక కొత్త సంచలనం నమోదు కాబోతుంది. ఒక్క తమిళనాడే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఆ సంచలనం కోసం ఎదురుచూస్తూ ఉంది. ఆ సంచలనానికి కారణం అవుతున్న హీరోలు మాములు హీరో లు కాదు. తమిళనాడు చిత్ర పరిశ్రమాన్ని గత 30 ఏళ్ళుగా ఏకచత్రాధిపత్యంగా ఏలుతున్న రజనీ కాంత్ అండ్ కమల్ హాసన్.

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా ఇండియన్ 2 .ఈ సినిమా ఇంట్రో టీజర్ ని సూపర్ స్టార్ రజనీ కాంత్ ఈ రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నాడు. దీంతో తమిళనాడు వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొని ఉంది. రజని అండ్ కమల్ ఫ్యాన్ మధ్య ఆ ఇరువురి హీరో ల సినిమా విషయం లో గొడవలు జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు కమల్ ఇండియన్ 2 సినిమా ఇంట్రో టీజర్ ని రజనీ రిలీజ్ చెయ్యడం తో మేమిద్దరం ఒకటే అని ఇద్దరు ఇరువురి ప్యాన్స్ కి చెప్పినట్టు అయ్యింది.

తమిళనాడు చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇండియన్ వైడ్ గా భారీ సంఖ్యలో అభిమానులని కలిగి ఉన్న నటులు కమల్ అండ్ రజనీ. తమిళనాడు ప్రజానీకం మొత్తం కమల్ ,రజనీని విపరీతంగా ఆరాధిస్తుంది. లేటెస్ట్ గా జైలర్ సినిమాతో రజనీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసాడు. కమల్ కూడా తన ఇండియన్ 2 సినిమాతో సరికొత్త రికార్డులుక్రియేట్ చెయ్యాలనిఅందరు కోరుకుంటున్నారు.