English | Telugu
ప్రముఖ నటిని అరెస్ట్ చేసిన పోలీసులు!
Updated : Nov 3, 2023
పలు టీవీ సీరియల్స్, షోస్, వెబ్ సిరీస్‌లతో పాపులర్ అయిన ఉర్ఫీ జావేద్ గురించి అందరూ వినే ఉంటారు. సోషల్ మీడియాలో కూడా ఉర్ఫీ నోటెడ్ పర్సన్ కావడంతో ప్రతి ఒక్కరూ ఆమెను గుర్తిస్తారు. ఆమె వేష ధారణ చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడూ ఎక్కడా చూడని డ్రెస్సులు వేసుకుంటూ కుర్రకారును పిచ్చెక్కించడమే పనిగా పెట్టుకున్న ఉర్ఫీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
శుక్రవారం ఉదయం ఒక రెస్టారెంట్‌కి వెళ్ళి ఉర్ఫీ అక్కడి నుంచి బయల్దేరేందుకు సిద్ధపడి బయటికి వచ్చినపుడు రెస్టారెంట్ బయట కాపు కాసిన పోలీస్ అధికారులు ఆమెను అరెస్ట్ చేసేందుకు ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్‌ను పంపించారు. అసభ్యకరమైన డ్రెస్సులు వేసుకొని పబ్లిక్‌లో తిరుగుతున్నందుకు తనను అరెస్ట్ చేస్తున్నామని, వచ్చి జీప్‌లో కూర్చోమని పోలీసులు చెప్పగా, వారితో వాగ్వాదానికి దిగింది ఉర్ఫీ. పోలీసులతో వెళ్ళడానికి సిద్ధంగా లేదని గ్రహించిన మహిళా పోలీసులు ఆమెను చెరో వైపు చేతులు పట్టుకొని తీసుకెళ్ళి జీప్‌లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉర్ఫీని అరెస్ట్ చేయడం ఫేక్ అని కొందరంటుంటే, నిజమేనని కొందరు కామెంట్ పెడుతున్నారు. మరికొందరు ఉర్ఫీని అరెస్ట్ చేసిన పోలీసులకు ధన్యవాదాలు చెబుతున్నారు.