English | Telugu

రాజమౌళి ఒక కాంట్రాక్టర్.. ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు!

తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడమే కాకుండా, పాన్ ఇండియా ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన చిత్రం 'బాహుబలి'. ఇప్పుడు 'బాహుబలి' రెండు భాగాలు కలిపి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. ఒక కొత్త సినిమా విడుదలైన రేంజ్ లో ఆడియన్స్ నుండి రెస్పాన్స్ వస్తోంది. సెలబ్రిటీలు సైతం 'బాహుబలి: ది ఎపిక్' చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. (Baahubali: The Epic)

'బాహుబలి' బాటలో పయనించి, పాన్ ఇండియా వైడ్ గా సౌండ్ చేసిన సినిమాల్లో 'కేజీఎఫ్' ఒకటి. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. అలాంటి నీల్, తాజాగా రాజమౌళిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఒక రోడ్డుకి మరమత్తులు చేయాల్సి వచ్చింది. దీంతో ఓ కాంట్రాక్టర్ ని పిలిచారు. ఆ కాంట్రాక్టర్ రోడ్డుని ఫిక్స్ చేయడమే కాకుండా.. ఏకంగా దాన్ని 16 లైన్ల సూపర్ ఎక్స్ ప్రెస్ హైవేగా మార్చేశాడు. ఆ రోడ్డు ఏదో కాదు.. పాన్ ఇండియా. ఆ కాంట్రాక్టర్ ఎవరో కాదు.. రాజమౌళి. ఒక తరం కోసం కలలు కన్న బాహుబలి టీమ్ కి అభినందనలు" అంటూ ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ప్రశాంత్ నీల్ మాటలను ఆయన సతీమణి లిఖిత సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

కాగా, ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో 'డ్రాగన్' అనే సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్.. షూటింగ్ దశలో ఉంది.

Also Read: మహేష్ తో సందీప్ రెడ్డి మూవీ.. స్పిరిట్ సంగతేంటి..?

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.