English | Telugu
త్రివిక్రమ్‌కి మహేష్‌తో వద్దని చెప్పిన ఎన్టీఆర్?
Updated : Nov 12, 2020
'అల... వైకుంఠపురములో' ఘన విజయం తరవాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయడానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సిద్ధమయ్యారు. వీళ్లిద్దరి కలయికలో సినిమా చేస్తున్నట్టు హారిక అండ్
హాసిని క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే... కరోనా వైరస్ వల్ల ఈ సినిమా పట్టాలు ఎక్కడం ఆలస్యమైంది.
'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణ సైతం సకాలంలో పూర్తి కాకపోవడం వలన ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. ఈలోపు మరో సినిమా చేయాలని చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారనీ, అయితే ఎన్టీఆర్ వద్దని చెప్పారని ఫిలింనగర్ టాక్.
లాక్‌డౌన్‌లో మహేష్ బాబుకు త్రివిక్రమ్ కథ చెప్పారు. 'ఖలేజా' సినిమా విడుదలై పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ట్వీట్ చేసిన మహేష్, త్వరలో త్రివిక్రమ్‌తో పని చేయడానికి ఎదురు చూస్తున్నట్టు
పేర్కొన్నారు. అప్పుడే వీళ్లిద్దరి కలయికలో మరి సినిమా వస్తుందని అర్థమైంది.
మహేష్ కాకుండా యుంగ్ హీరో రామ్‌కి కూడా త్రివిక్రమ్ కథ చెప్పారు. అయితే... రామ్ సినిమా కంటే మహేష్ సినిమా ముందు ప్రారంభించి, త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారట. మరో వైపు
పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా మహేష్ అంగీకరించినప్పటికీ... ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయలేదు. ఆ సినిమాతో పాటు త్రివిక్రమ్ ఓకే అంటే అతడి సినిమానూ సమాంతరంగా షూటింగ్
చేయాలని అనుకున్నారట. అయితే, త్రివిక్రమ్‌కి మహేష్‌తో సినిమా చిత్రీకరణ ప్రారంభించవద్దని ఎన్టీఆర్ చెప్పారట. ఈ ఏడాది వెయిట్ చేయమని, త్వరలో మన సినిమా చిత్రీకరణ ప్రారంభిద్దామని అన్నారట.