English | Telugu

చరణ్ స్టెప్పులు.. జాన్వీ అందాలు.. సిక్స్ కొట్టిన చికిరి!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ 'పెద్ది'(Peddi). ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా.. 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న 'పెద్ది' నుండి తాజాగా ఫస్ట్ సాంగ్ విడుదలైంది.

'పెద్ది' ఫస్ట్ సింగిల్ 'చికిరి చికిరి'.. ప్రోమోతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక తాజాగా విడుదలైన వీడియో సాంగ్ ఆకట్టుకుంటోంది. రెహమాన్ స్వరపరిచిన ఈ మెలోడీ వినసొంపుగా ఉంది. వీడియోలో రామ్ చరణ్ డ్యాన్స్ హైలైట్ గా నిలిచింది. మెలోడీ సాంగ్ లోనూ తన డ్యాన్స్ టాలెంట్ చూపించాడు. గ్రేస్ తో మ్యాజిక్ చేశాడు. (Chikiri Chikiri Song)

Also Read:జటాధర మూవీ రివ్యూ

'చికిరి చికిరి' వీడియో సాంగ్ లో రామ్ చరణ్ డ్యాన్స్ ఎంత హైలైట్ అయిందో.. జాన్వీ కపూర్ గ్లామర్ ట్రీట్ కూడా అంతే హైలైట్ గా నిలిచింది. కుర్రాళ్ల మతిపోగొట్టేలా జాన్వీ ఎంతో గ్లామర్ గా కనిపించింది.

మొత్తానికి చరణ్ స్టెప్పులు, జాన్వీ గ్లామర్ తో.. 'పెద్ది' ఫస్ట్ సింగిల్ 'చికిరి చికిరి' సాంగ్ సిక్స్ కొట్టిందని చెప్పవచ్చు.