English | Telugu

పార్థుడు మూవీ రివ్యూ

పార్థుడు మూవీ రివ్యూ

మూవీ : పార్థుడు 
నటీనటులు: ప్రకాశ్ రాజ్, అనూప్ మీనన్ , సన్నీ వేన్, సురేష్ కృష్ణ, శంకర్ రామకృష్ణ తదితరులు
ఎడిటింగ్: అయూబ్ ఖాన్
సినిమాటోగ్రఫీ: రవి చంద్రణ్
సంగీతం: గోపీ సుందర్
నిర్మాతలు: పీఎ సెబాస్టియన్
దర్శకత్వం: కన్నన్ తామరైకులం
ఓటిటి : ఈటీవి విన్

మలయాళం నుండి డబ్బింగ్ అయిన సినిమాలకి క్రేజ్ ఉంటుంది. అక్కడ యావరేజ్ టాక్ తెచ్చుకున్న కొన్ని సినిమాలు తెలుగులో హిట్ అవుతుంటాయి. మరికొన్ని ఫ్లాప్ అవుతుంటాయి. మలయాళంలో 'వరాల్' పేరుతో రిలీజైన సినిమా తెలుగులో 'పార్థుడు'గా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సినిమా కథేంటో ఒకసారి చూసేద్దాం.

కథ: 

కేరళలో ముఖ్యమంత్రిని నిర్ణయించే అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం ఏర్పాట్లు జరుగుతుంటాయి. అయితే అక్కడ ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరనే ఆసక్తి అందరిలోను ఉంటుంది. అచ్యుతన్ నాయర్(ప్రకాశ్ రాజ్) గత రెండు పర్యాయాలుగా సీఎంగా చేస్తుంటాడు. అయితే ఈ సారి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ హై కమాండ్  భావిస్తుంది. అచ్యుతన్ నాయర్ ను కాదని డేవిడ్ జాన్( అనూప్ మీనన్) ను సీఎం అభ్యర్థిగా నిలబెడతారు. అయితే డేవిడ్ జాన్ సీఎం అభ్యర్థి ఏంటనే వ్యతిరేకత ఎక్కువగా వినిపిస్తుంది. ఇదే క్రమంలో డేవిడ్ జాన్ ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. డేవిడ్ జాన్ ని కిడ్నాప్ చేసిందెవరు? సీఎం గా ఎవరు  ఎన్నికయ్యారు తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:

పొలిటికల్ గేమ్స్ తో వచ్చిన ఈ సినిమా రొటీన్ డ్రామాలా అనిపిస్తుంది. మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాకి సెకండ్ వర్షన్ లా అనిపిస్తుంది ఈ మూవీ. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక దగ్గర రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. అది తప్ప మిగతాదంతా పర్లేదు. హీరో అనూప్ మీనన్ పర్ఫామెన్స్ కి ఫిధా అవ్వాల్సిందే. అయితే హీరో చెప్పే డైలాగ్ కి సంబంధం లేకుండా వచ్చే ఎలివేషన్సే కాస్త అతి అనిపిస్తాయి. 

ఈ సినిమా మొత్తం సీఎం ఎవరనే ఆసక్తితో కొనసాగుతుంది. మంచి కంటెంట్ ని తెరపై చూపించడంలో డైరెక్టర్ కన్నన్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. సీఎం ఎవరని రివీల్ చేయడానికే ఇరవై నిమిషాలు తీసుకున్నాడు డైరెక్టర్ కన్నన్. ఈ సినిమా చూస్తున్నంతసేపు లూసిఫర్ మూవీ సీన్సే గుర్తొస్తుంటాయి. చాలా వరకు అవే రిపీట్ అవుతుంటాయి. సినిమా మొదలైనప్పటి నుండి కొత్త క్యారెక్టర్స్ వస్తూనే ఉంటాయి. ఎవరు ఎందుకు వస్తున్నారో అసలు అర్థమే కాదు. ప్రథమార్ధంలో ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కాస్త కొత్తగా అనిపిస్తుంది. సినిమా మొదలైన గంట తరువాత కూడ కొత్త క్యారెక్టర్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పటి వరకు వచ్చిన క్యారెక్టర్స్ ని వాడుకున్నారా అంటే అదీ లేదు. సెకండాఫ్ లో వచ్చే ఆ డ్రామా థ్రిల్ తప్పితే ఏదీ పెద్దగా కొత్తగా అనిపించదు. అసలు ఏం ఉందా అనే గజిబిజి సుడోకులా ఈ 'పార్థుడు' ఉంటుంది.  

ఈ సినిమాకి నిడివి మైనస్. ఈ కంటెంట్ కి గంట కూడా చాలా ఎక్కువే. అయితే సమాజంలో‌ పెరుగుతున్న స్వార్థ రాజకీయాలని చక్కగా చూపించాడు‌. ఇందులో అనవరపు సీన్లే ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ చూసే ప్రేక్షకుడి ఓపికకి పరీక్ష లాంటిదే. ఎడిటర్ అయూబ్ ఖాన్ కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది. సెకండాఫ్ లో పది నిమిషాలు బాగుంటుంది. క్లైమాక్స్ పర్వాలేదు. ఇక మిగతాదంత ఎందుకనే ఆలోచన చూసే ప్రేక్షకుడికి అనిపిస్తుంది. గోపీ సుందర్ సంగీతం ఆకట్టుకుంటుంది.‌ ముఖ్యంగా డేవిడ్ జాన్ ని ఎలివేట్ చేసే సీన్ లో బిజిఎమ్ బాగుంటుంది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

అచ్యుతన్ నాయర్ పాత్రలో ప్రకాశ్ రాజ్ యాక్టింగ్ ఈ సినిమాకి ప్లస్ అయింది. మలయాళీ హీరో అనూప్ మీనన్ గారి నటన బాగుంది. ఇక మిగిలిన వారు వారి పాత్రల పరిధి మేరకు నటించారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్ :

పొలిటికల్ గేమ్ గా వచ్చిన ఈ పార్థుడు.. సాగదీసే సీన్లని పక్కన పెడితే ఒక్కసారి మాత్రమే చూడగలం. అది కూడా ఓపిక ఉన్నవాళ్ళకి మాత్రమే.

రేటింగ్: 2 / 5

✍🏻. దాసరి మల్లేశ్