English | Telugu
షారూఖ్ ‘జవాన్’ కలెక్షన్స్‌పై మహేష్ కామెంట్స్!
Updated : Sep 8, 2023
ఆమధ్య ‘పఠాన్’ సెన్సేషన్ క్రియేట్ చేసిన షారూఖ్ ఖాన్ ఇప్పుడు ‘జవాన్’తో మరోసారి బాక్సాఫీస్‌పై విరుచుకుపడుతున్నాడు. గురువారం విడుదలైన ఈ సినిమా మొదటి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతూ సంచలనం సృష్టిస్తోంది. మొదటి రోజు 150 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి పఠాన్ సహా ఇతర బాలీవుడ్ సినిమాల కలెక్షన్స్‌ను దాటిపోయింది.
ఈ సినిమా సాధిస్తున్న భారీ విజయానికి స్పందించిన మహేష్‌బాబు తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ‘జవాన్ బ్లాక్‌బస్టర్ మూవీ. కింగ్‌ను కింగ్ సైజులో చూపించేశాడు అట్లీ.. కెరీర్ బెస్ట్ సినిమా అయింది.. షారుఖ్ ఖాన్ తెరపై కనిపించినప్పుడు వచ్చిన ఆ ఆరా, కరిష్మా ఎవ్వరిలోనూ కనిపించదు. ఎవ్వరూ దాన్ని మ్యాచ్ చెయ్యలేరు కూడా. మంట పుట్టించేశాడు.. జవాన్ సినిమాతో తన రికార్డులను తానే బద్దలు కొట్టేసుకుంటున్నాడు.. వినడానికి ఇది ఎంతో బాగుంది.. లెజెండ్‌లు బరిలోకి దిగితే అంతే ఉంటుంది’ అంటూ మహేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
