English | Telugu

నయన్, అట్లీ.. వాట్ ఎ కాంబో.. సాలిడ్ హ్యాట్రిక్ కొట్టేశారుగా!

నయన్, అట్లీ.. వాట్ ఎ కాంబో.. సాలిడ్ హ్యాట్రిక్ కొట్టేశారుగా!

కొన్ని కొన్ని కాంబినేషన్స్ అంతే.. జట్టుకట్టిన ప్రతీసారి హిట్టు కొట్టేస్తుంటాయి. అలాంటి కాంబినేషన్స్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ కెప్టెన్ అట్లీ ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు వీరిద్దరూ మూడు సినిమాలు చేయగా.. అవన్నీ కమర్షియల్ గా భలేగా వర్కవుట్ అయ్యాయి.

ఆ వివరాల్లోకి వెళితే.. అట్లీ దర్శకుడిగా పరిచయమైన తొలి చిత్రం 'రాజా రాణి'. ఇందులో నయనతారనే మెయిన్ హీరోయిన్. సరిగ్గా పదేళ్ళ క్రితం అంటే 2013లో జనం ముందు నిలిచిన ఈ తమిళ సినిమా.. ఘనవిజయం సాధించింది. కట్ చేస్తే.. వీరిద్దరి కలయికలో ఆరేళ్ళ తరువాత 'బిగిల్' వచ్చింది. దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ మూవీ కూడా విజయపథంలో పయనించింది. ఇక రీసెంట్ గా రిలీజైన బాలీవుడ్ మూవీ 'జవాన్'.. నయన్, అట్లీ కాంబోలో థర్డ్ జాయింట్ వెంచర్. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ ముంగిట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మొత్తమ్మీద.. 'రాజా రాణి', 'బిగిల్', 'జవాన్'తో నయనతార, అట్లీ కాంబినేషన్ సాలిడ్ హ్యాట్రిక్ కొట్టేశారన్నమాట.