English | Telugu

ఓటీటీలో సంచలనాలు సృష్టిస్తోన్న ఓదెల-2 

ఓటీటీలో సంచలనాలు సృష్టిస్తోన్న ఓదెల-2 

 

ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న 'ఓదెల రైల్వేస్టేషన్'కు సీక్వెల్ గా రూపొందిన చిత్రం 'ఓదెల 2'. తమన్నా భాటియా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సంపత్ నంది రచయితగా, నిర్మాతగా వ్యవహరించారు. అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఇక ఓటీటీలో అయితే సంచలనాలు సృష్టిస్తోంది.

 

 

'ఓదెల 2' చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 8న అడుగుపెట్టింది. అప్పటినుంచి ఈ మూవీ టాప్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. 12 రోజుల నుంచి అమెజాన్ ప్రైమ్ లో టాప్-1 లో ఉంది. కేవలం అమెజాన్ ప్రైమ్ లోనే కాకుండా.. అన్నీ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పరంగానూ నేషనల్ వైడ్ గా సత్తా చాటుతోంది. ఓర్మాక్స్ మీడియా నివేదిక ప్రకారం, మే 12–18 వారానికి గాను 3.8 మిలియన్ వ్యూస్ తో 'ఓదెల 2' జాతీయ స్థాయిలో  రెండవ స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుత జోరు చూస్తుంటే మున్ముందు ఓటీటీలో 'ఓదెల 2' మరిన్ని సంచలనాలు సృష్టించేలా ఉంది.

 

 

ఓటీటీలో సంచలనాలు సృష్టిస్తోన్న ఓదెల-2 

ఓటీటీలో సంచలనాలు సృష్టిస్తోన్న ఓదెల-2